అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, అసెంబ్లీలో పోడియం వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఈ నిరసన అనంతరం, వారు సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేపట్టారు. అయితే, మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీస్ వాహనాల్లో తెలంగాణ భవన్కు తరలించారు.