ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో ఆరు నెలల ఘట్టం పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. “స్వర్ణాంధ్ర 2047” అనే విజన్ ద్వారా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు.
ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నైపుణ్య అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ రంగానికి సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పది ప్రధాన సూత్రాలు ఉన్నాయి. “వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్” నినాదంతో రాష్ట్ర ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు
అంతేగాక, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరం అమలు చేయడం, పారదర్శక పాలన అందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను ప్రతిక్షణం శ్రద్ధగా పరిగణిస్తున్నామని కూడా ఆయన తెలిపారు.