రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల రైతు భరోసాపై ఈ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసాపై ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు రూ.80 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. గతంలో సాగుచేయని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు.