వన్‌నేషన్ వన్ ఎలక్షన్.. జమిలి ఎన్నికల బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పార్లమెంటులో శుక్రవారం, శనివారం రాజ్యాంగంపై చర్చ జరగనుంది. శనివారం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
ఈరోజు రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో మాట్లాడనున్నారు.శనివారం ప్రధాని మోదీ పార్లమెంటు వేదికగా ప్రసంగించనున్నారు. అయితే ఈరోజు కాంగ్రెస్ నుంచి ఎంపీ ప్రియాంక గాంధీ ప్రసంగించే అవకాశాలున్నాయి.
మరోవైపు జమిలి బిల్లుకి కేంద్రం ఆమోదం తెలపడం.. డ్రాఫ్ట్ బిల్లుని ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతుండడంతో అనేక పార్టీలు వ్యతిరేకబావుటా ఎగరవేస్తున్నాయి.
జమిలి వల్ల దేశానికి వచ్చే లాభమేమీ లేదంటూ మండిపడుతున్నాయి.
తమిళనాడు సీఎం స్టాలిన్ జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నెన్స్‌కు పెను విఘాతం కలిగిస్తుందని విమర్శించారు.అసదుద్దీన్ ఒవైసీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్ద కుట్ర అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్.