వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు మన తెలుగు వాడే అని తెలుసా? అతనిది ఏ జిల్లానో తెలుసా ?
చెస్ ఛాంపియన్‌గా నిలిచిన యంగ్ ఇండియన్ సొంతూరు సంబరాల్లో మునిగిపోయింది. సొంత గ్రామం ప్రతిష్ట పెరిగిపోయింది .
చరిత్రను తిరగరాసిన 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ సూపర్ హీరోగా నిలవడంతో తాతా ముత్తాతల సొంతూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగలోని స్థానికుల్లో ఆనందం వెల్లు విరిసింది.
చిన్న వయసులోనే భారతీయ చెస్ చాంపియన్‌గా గుకేష్ ఆ కీర్తిని సంపాదించడంతో తెలుగువాడి ప్రతిభ చాటి నట్లైంది.
చైనాకు చెందిన డింగ్ లిరెన్‌పై గుకేష్ విజయం సాధించాడు. గుకేశ్ సొంత గ్రామంలో వేడుకలు చేసారు గుకేష్ చదరంగంపై ఉన్న ఆసక్తితో 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. .