బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, “ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లి గ మార్చేశారు” అంటూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తోందని కవిత ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు ఈ విషయాలను మరువరాదని కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పక్షం తీవ్ర ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది