మంచు కుటుంబంలో తాజాగా జరిగిన వివాదం పెద్ద చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో గొడవ మరింత సీరియస్‌గా మారింది. ముఖ్యంగా మంచు మనోజ్ మరియు విష్ణు మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
వివాదానికి సంబంధించి ఇంటి పనిమనిషి కొన్ని నిజాలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రకారం, కొన్ని కుటుంబ విభేదాలు బయటకు రావడం వల్ల సమస్యలు మరింత చిలికి చిలికి గాలివానలా మారాయి. మంచు మనోజ్ తన అన్న విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు వీడియోల్లో పేర్కొన్నారు. అయితే విష్ణు మాత్రం ఈ వివాదాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ఇది కేవలం చిన్న గొడవ మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు
కుటుంబ పెద్ద అయిన మోహన్ బాబు ఈ వివాదాన్ని సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో మంచు బ్రదర్స్ వివాదం విస్తృత చర్చకు దారి తీస్తోంది