తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ట్వీట్ చేస్తూ “నా స్నేహితుడు రజినీకాంత్ విజయాల పరంపర కొనసాగాలని, ఆయురారోగ్యాలతో జీవితం ఆనందంగా సాగాలని” ఆకాంక్షించారు. అలాగే రజినీకాంత్‌తో దిగిన ఫోటోను పంచుకుంటూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు
73 ఏళ్ల వయసులో అడుగిడిన రజినీకాంత్‌కు దేశం నలుమూలల నుంచి అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.